Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు రాజ్యంలో రాక్షస పాలన

రైతు రాజ్యంలో రాక్షస పాలన

- Advertisement -

– రాయపర్తి మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతు రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంపై పూర్తి మొండి వైఖరితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. యూరియాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నట్లు వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే వారి బాధను పట్టించుకునే అధికార పార్టీ నాయకులు ఏ ఒక్కరు లేకపోవడం బాధాకరమన్నారు.

రాయపర్తి మండలానికి సరిపడే యూరియాలో 10 శాతం కూడా రైతులకు అందలేదు అని స్పష్టం చేశారు. అదును దాటుతున్న తరుణంలో రైతులకు సకాలంలో యూరియా అందించకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రోకో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, నాయకులు తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గుగులోత్ జాజు నాయక్, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, గారే నర్సయ్య, చిన్నాల రాజబాబు, పరుపాటి రవీందర్ రెడ్డి, చిట్యాల వెంకన్న, ముద్రబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -