Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంద‌ట్ట‌మైన పొగ‌మంచు..ప‌లు వాహ‌నాలు ఢీ

ద‌ట్ట‌మైన పొగ‌మంచు..ప‌లు వాహ‌నాలు ఢీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పొగ‌మంచు కార‌ణంగా శ‌నివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు కార్లు ఢీకొన్నాయి. అదే మాదిరిగా ఇవాళ హ‌ర్యానాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోహ్తక్‌లోని మెహమ్ ప్రాంతంలో ఒక హైవే కూడలి వద్ద ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్మేసింది. సుమారు 35 నుంచి 40 వాహనాలు గొలుసుకట్టుగా ఢీకొన్నాయి. మొదట ఒక ట్రక్కు, కారు ఢీకొనగా, వెనుక వస్తున్న వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొంటూ వెళ్లాయి. ఈ ఘటనలో అనేక వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒక ట్రక్కు పూర్తిగా దెబ్బతినగా, అందులో చిక్కుకున్న వారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -