అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు
2 కిలోమీటర్ల వరకు అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు
అదనంగా 5 ట్రాన్స్‌ఫార్మర్లు… మొబైల్ డీటీఆర్
150 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ : ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) విస్తృత ఏర్పాట్లు చేసిందని చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామ ని పేర్కొన్నారు. 33/11 కేవీ మీర్‌ఖాన్‌పేట్ సబ్‌స్టేషన్ నుంచి సదస్సు జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్ సర్క్యూట్ అండర్‌గ్రౌండ్ కేబుల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఒక 100 కేవీఏ, రెండు 160 కేవీఏ, రెండు 315 కేవీఏ కెపాసిటీ కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రాంగణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికితోడు ఒక 315 కేవీఏ కెపాసిటీ కలిగిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌కు సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ నర్సింహులును ఇంచార్జీగా నియమించామని తెలిపారు. దాదాపు 150 మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది శనివారం నుంచి సదస్సు ముగిసే వరకు ఆ ప్రాంతంలో సరఫరా తీరును పర్యవేక్షిస్తారని వివరించారు. శుక్రవారం చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో ఆయన టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాలకు సంబందించిన పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారని చెప్పారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు ముఖ్యం గా గ్రేటర్ హైదరాబాద్ సర్కిళ్ల సిబ్బంది తప్పనిసరిగా సేఫ్టీ జాకెట్లు ధరించాలనీ, క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలు, ఇతర పరికరాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు విద్యుత్‌కు శాఖ విస్తృత ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



