- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం(D) వైరా(M)లోని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాలలక్ష్మీపురం పంచాయతీ స్థానాన్ని ఏకగ్రీవం చేశారు. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామ అభివృద్ధి, ఐక్యతను దృష్టిలో ఉంచుకుని, భట్టి సూచన మేరకు కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న నూతి వెంకటేశ్వరరావును సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- Advertisement -



