Sunday, December 7, 2025
E-PAPER
Homeసోపతికోరికలను అదుపులో పెట్టుకోవాలి…

కోరికలను అదుపులో పెట్టుకోవాలి…

- Advertisement -

మనసు కోరికలకు నిలయం. కోరికలు ఏమీ లేవు అనుకుంటూనే ఒక దాని తర్వాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. కోరికలు ఉండటం తప్పుకాదు, కానీ వాటిని ఎలాగైనా తీర్చుకోవాలి అని అనుకోవడం, అందుకు తప్పుదారులు పట్టడం, అప్పులు చేయడం సరైన పద్ధతి కాదు.
తప్పుదారులు తొక్కినప్పుడు మనసులో దుఖం తప్పక వస్తుంది. ఎందుకంటే ఆ సమయానికి తాము తీర్చుకోవాలనుకున్న కోరిక తీర్చుకున్నా, సంతోషం కంటే అశాంతి మనసులో తిష్ట వేసుకు కూర్చుంటుంది.
మనిషి తన మనసుకి కళ్లెం వేయగలగాలి. దానినే నిగ్రహశక్తి అంటారు. మనం చూస్తూనే ఉంటాం… కొందరు తమ మనసును అదుపులో ఉంచుకోవడానికి దీక్షలని, ఉపవాసాలని, మౌన వ్రతాలని చేస్తుంటారు. ఇటువంటి వాటి వలన మనసు తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ఒక ప్రయత్నం.
మనిషి కోరికలు తీర్చుకోవాలి అనుకోవడం తప్పుకాదు. కానీ అవి తమ పరిధిలోనివి అయ్యుండాలి. కొన్ని కోరికలు తీరాలంటే కష్టపడాలి. ఎక్కువగా ఈ కోరికలు ఆర్ధికంగా ముడిపడి ఉంటాయి. అందరికి ఆర్ధిక స్థోమత బలంగా ఉండక పోవచ్చు. అటువంటప్పుడు ప్రణాళిక వేసుకుని అందుకు తగిన విధంగా కష్టపడాలి.
డబ్భు, హోదా ఉంటే చాలు కోరికలు తీరిపోతాయి అనుకుంటారు. పలుకుబడి ఉపయోగించి తమకు కావలసిన దానిని పొందవచ్చని అనుకుంటారు. చెడ్డపేరు తెచ్చుకుంటారు. నలుగురిలో నవ్వులపాలు అవుతారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే సంతప్తి ఉంటే దానికంటే మించింది లేదని. మంచి పేరు, నడవడి వలన సంతోషం , సమాజంలో గౌరవం పెరుగుతాయనే విషయాన్ని గ్రహించాలి.
కోరికలు వినాశనానికి కారణం కాకూడదు. కనుక కోరికలకు దూరంగా ఉండటం లేదా వాటిని అదుపులో ఉంచుకోవడానికి కషి చేయాలి. మరి ప్రయత్నించి చూస్తారు కదూ…

  • పాలపర్తి సంధ్యారాణి
    9247399272
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -