Wednesday, January 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్హరీష్ రావుపై కాంగ్రెస్ కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచింది

హరీష్ రావుపై కాంగ్రెస్ కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచింది

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మాజీ మంత్రి ఉపపక్ష నేత  హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఆయనపై బురదజల్లి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని, బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి గంగాధర్ అన్నారు. ఎటువంటి ఆధారాలు లేవని తెలిసినా కేవలం కక్షసాధింపు కోసమే సుప్రీంకోర్టు వరకు వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ చుక్కెదురు కావడం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు అన్నారు. ఇకపై ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని విచారించేందుకు వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని తేలిపోయాయి.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుల గొంతు నొక్కాలని చూస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకొని, ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టాలన్నారు. అబద్ధపు ప్రచారాలు, రాజకీయ కుతంత్రాలు ఎంతో కాలం సాగవని, చివరికి ధర్మమే నిలబడుతుందని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -