Saturday, November 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలువాస్తవ కథతో 'దేవగుడి'

వాస్తవ కథతో ‘దేవగుడి’

- Advertisement -

పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా, స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”దేవగుడి’ టైటిల్‌ చాలా బాగుంది. టీజర్‌ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్ర పాడిన మెలోడీ సాంగ్‌ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్‌ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. కచ్చితంగా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. మా రామకృష్ణా రెడ్డికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాను. డిసెంబర్‌ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు.

”దశ్యకావ్యం’ తరువాత ఈ సినిమాకి డైరెక్షన్‌ చేశాను. కచ్చితంగా హిట్‌ కొట్టబోతున్నాం. ఆల్రెడీ ఈ సినిమాను నిపుణులు, సెన్సార్‌ మెంబర్స్‌ అందరూ చూసి.. ఎంతగానో మెచ్చుకున్నారు. కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నాను. స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, డీఓపీ లక్ష్మీకాంత్‌ కనికే, హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, సినిమాను ప్రేక్షకులు సక్సెస్‌ చేయాలని కోరారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, నిర్మాత: బెల్లం రామకృష్ణా రెడ్డి, సంగీతం: ఎస్‌, కె మదీన్‌, రఘు కుంచె, డిఓపి: లక్ష్మీకాంత్‌ కనికే, ఎడిటర్‌: వి. నాగిరెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -