Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేవత్‌ జోసెఫ్‌ కుటుంబానికిరూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

దేవత్‌ జోసెఫ్‌ కుటుంబానికిరూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

- Advertisement -

ప్రభుత్వానికి టీహెచ్‌ఆర్‌సీ సిఫారసు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బాధిత దేవత్‌ జోసెఫ్‌ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చిన్నారి దేవత్‌ జెసెఫ్‌(10) మరణంపై విచారించిన కమిషన్‌ శుక్రవారం తీర్పును వెలువరుస్తూ ఆరు నెలల్లోగా సిఫారసులను అమలు చేసి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నాయకత్వంలో విచారించిన కమిషన్‌ గిరిజన సంక్షేమ విభాగం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా దేవత్‌ జోసెఫ్‌ మరణించారని నిర్థారించింది.

మరణించిన బాలుని తల్లి చెవిటి, మూగ వైకల్యంతో బాధపడుతూ ఇప్పుడిప్పుడే జీతం అందుకునే స్థితికి చేరిందని కమిషన్‌ గుర్తు చేసింది. ఆ తల్లి తన కుమార్తెతో పాటు వృద్ధురాలైన తన అత్తను పోషించాల్సిన ఒంటరి మహిళ అని తెలిపింది. ఈ నేపథ్యంలో అవసరమైన నిబంధనలను సడలించి లాస్ట్‌ గ్రేడ్‌లో క్యాటగిరీలో మానవతా దృక్పథంతో ఉద్యోగం కల్పించాలని కోరింది. ప్రభుత్వం తీసుకునే ఆ చర్య గౌరవం, మౌలిక హక్కులను కాపాడే చర్య అని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -