రతన్ సింగ్ తండాలో కాంగ్రేస్ ఖాళీ…
తాండ బీఆర్ఎస్ పార్టీ లోకి చేరిక..
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని చిన్న దేవి సింగ్ తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని రతన్ సింగ్ తండాకు చెందిన కాంగ్రేస్ పార్టీ నాయకులు తాండ మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయం చేసుకొని మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి మాజీ ఎంపీపీ పార్టీ ఖండువాలు కప్పి పార్టి లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాండ వసూలు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తాండ వాసులకు మభ్యపెట్టి కల్లబొల్లి మాట్లాలతో కాలం వెల్లధిస్తున్నారని ఎద్దవా చేశారు. అంతే కాకుండా మా తాండ వాసులకు అనేక ఇబ్బందులకు గురిచేశారని మాజీ ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు.గత హయాంలో మాజీ సర్పంచ్ భర్త తమకు మద్దతు తెలపాలని కోరగా తాండ మొత్తం ముక్తకంఠంతో మద్దతు ఇచ్చమని అప్పుడు మాకు వచ్చే ఎన్నికల్లో బాండు పేపర్ రాశి ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఇప్పుడేమో మాట తప్పరాని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మండలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే దర్శనమిస్తుంది తప్ప కాంగ్రెస్ నాయకులు చేసిందేమి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మోసపూరిత హామీలు తప్ప అభివృద్ధి లేదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మీ తాండ వాసులకు ఒకేసారి మోసం జరిగింది.
అధైర్య పడకుండా ఉండాలని మీకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపురిత హామీలను మీరు గ్రహించి పార్టీ లోకి తాండ వాసూలు మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.మీకు అన్ని విధాలుగా కష్ట పడి పార్టి బలపర్చిన అభ్యర్ధి గెలుపు కోసం కష్ట పడి పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,తాండ వాసులు పాల్గొన్నారు.



