కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి అభివృద్ధి బాట వేసుకోండి
మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ తోనే పేదలు అభివృద్ధి చెందుతారని ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మండలంలోని సోమవారం వివిధ గ్రామాలలో పర్యటించి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పెద్ద తండా, నేచరాజుపల్లి, సౌలతండ, బడి తండా, ఎర్రబెల్లి గూడెం, కాచికల్, రామన్నగూడెం, జామ తండా, రతి రామ్ తండా , హనుమాన్ నగర్ తండా, రాజుల కొత్తపల్లి, నైనాల, నల్లగుట్ట తండా, నెల్లికుదురు, బ్రాహ్మణ కొత్తపల్లి, మునిగల వీడు గ్రామాలతో పాటు పలు గ్రామాలు పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరించే మార్గంగా ముందుకు నడవండి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరే కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటే ఆ గ్రామం అన్ని రంగాలు అభివృద్ధి పరుచుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వివిధ శాఖల మంత్రుల నిధుల నుండి కోట్లాది రూపాయలు గ్రామాలకు తీసుకువచ్చి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని అన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఉచిత విద్యుత్తు ఉచిత బస్సు సౌకర్యం గ్రామాలకు రోడ్డు సౌకర్యం గ్రామంలో త్రాగునీటి సౌకర్యం గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులను తక్షణమే వాటిని గుర్తించి పరిష్కార మార్గంగా ముందుకు సాగుదాం అన అన్నారు. గెలిచిన సర్పంచ్ మా వద్దకు వచ్చి మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మా గ్రామ అభివృద్ధికి నిధులు కావాలని కోరుతాడని వెంటనే వాటిని మేము నిధులు మంజూరు చేయించి ఇస్తామని అన్నారు.
గత పాలకులు చేసిన అభివృద్ధి ఏమి లేదని వారి స్వార్ధ రాజకీయాల కోసమే పని చేశారని అన్నారు. నిధులు మంజూరు కాకముందు క కాకమ్మ మాటలు మాట్లాడి ప్రజలు మోసగించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇప్పుడు మేము వాటిని గుర్తించి మంజూరు చేయించి నిధులు తెప్పించి పనులు ప్రారంభించే మార్గంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మేచ రాజు పల్లి నుండి కాచికల్ వరకు రోడ్డును వేయించి బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నా


