అభివృద్ధిని చూసి అభ్యర్థిని గెలిపించండి: మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అభివృద్ధిని చూసి కోడిచర గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గైచోడే సాయవ్వ పీరాజిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు గ్రామ ప్రజలను కోరారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం అభ్యర్థి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో తాజా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు హనుమంత్ యాదవ్, మద్నూర్ మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, ఆ గ్రామ మాజీ సర్పంచ్ నాగేష్, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థితో పాటు పోటీ చేసే వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



