Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం 

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం 

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు భీర్ల ఐలయ్య అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆయన గురువారం మండలంలోని నర్సాపురం, దుప్పెల్లి గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులతో కావటి ధనలక్ష్మి, బీసు వెంకయ్య లతో కలిసి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి  ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులకుంపటిలోకి నెట్టారని, పది సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు, ఇండ్లు లేని పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో రైతులకు 2 లక్షల రుణ మాఫీ,సాగు నీటి కాల్వల అభివృద్ధి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు పథం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలుచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కావాటి మాచగిరి, నరేష్, దేవేందర్, పీసరి  వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -