Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సాధికారతతోనే అభివృద్ధి: కలెక్టర్

మహిళా సాధికారతతోనే అభివృద్ధి: కలెక్టర్

- Advertisement -

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. మంగళవారం స్థానిక కళాభారతిలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని 3689 స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 11 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్ ను ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్  సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో ముక్యంగా తెలంగాణలో మహిళలకు ప్రభుత్వాలు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయని అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాల కు వడ్డీలేని రుణాలు అందిస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సోలార్ యూనిట్లు, బస్సులు, పెట్రోల్ బంకులకు యజమానులుగా చేస్తుందన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుందని గుర్తు చేశారు పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం అందిస్తున్నామని, 500 గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నామని, మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు మండలంలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్డిఓ శేఖర్ రెడ్డి, తాసిల్దార్ సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సేర్ఫ్, మెప్మా అధికారులు బక్కయ్య, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -