Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి.. సంక్షేమమే ముఖ్యం

అభివృద్ధి.. సంక్షేమమే ముఖ్యం

- Advertisement -

మండలంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
నవతెలంగాణ-నిజాంసాగర్ : జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రథమ ప్రాధాన్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లికార్జున అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ముఖ్యమంత్రి దార్షానిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం తదితర అన్ని రంగాలను అభివృద్ధి పథకంలో దూసుకెళ్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన రోజు పురస్కరించుకొని బుధవారం మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. మండల రెవెన్యూ అధికారి బిక్షపతి తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని హైదరాబాద్ సంస్థనం భారత దేశంలో ఐక్యమై 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రోజును పురస్కరించుకొని ప్రజాపాలన వేడుకలను నిర్వహించుకుంటున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -