- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని దేవుని కూడా గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన రామటింకి రాజేష్, ఉప సర్పంచ్ కళ్లెం శ్రీనివాసరెడ్డికి ఇతర వార్డు సభ్యులకు ఆ గ్రామస్తులు బీఆర్ఎస్ జన్నారం మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీలో శాలువా పూలమాలతో సత్కరించారు. సందర్భంగా రాజారామ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుని గూడా గ్రామపంచాయతీని మంచిర్యాల జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా అభివృద్ధి చేయడానికి, నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



