- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం ముగించుకుని.. అకస్మాత్తుగా గుండె పోటుతో భక్తుడు మృతి చెందిన సంఘటన సోమవారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన ఈగుర్ల మల్లేశం(60) శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శించుకున్నారు. దర్శనం పూర్తయి వెళ్తున్న క్రమంలో ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా గుండె పోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్ 108 సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది పరీక్షించి మృతి చెందాడని తెలిపారు. ఆలయ సిబ్బంది మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
- Advertisement -