Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శివలింగానికి ఇత్తడి తాపడం చేయించిన భక్తులు

శివలింగానికి ఇత్తడి తాపడం చేయించిన భక్తులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయం గర్భ గుడిలో శివలింగానికి ఇత్తడి తాపడం చేయించారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాంబార్ కిషన్-హిమబిందు దంపతులు రూ.15వేల16 ఖర్చుతో స్వామివారికి ఇత్తడి తాపడం చేయించారు. అట్టి ఇత్తడి తాపడాన్ని ఆదివారం ఆలయ ప్రధాన పూజారి హయగ్రీవ కు అందజేయగా దానిని ప్రత్యేక పూజలు అనంతరం శివలింగానికి అలంకరించారు.శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయం గర్భ గుడిలో శివలింగానికి అత్యంత ఆకర్షణీయంగా, అందంగా ఇత్తడి తాపడం చేయించిన సాంబార్ కిషన్- హిమబిందు దంపతులకు, వీరి కుటుంబానికి శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు పూజారి హయగ్రీవ తెలిపారు. ఇత్తడి తాపడం చేయించిన సాంబార్ కిషన్- హిమబిందు దంపతులకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad