Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్టోపస్‌ పీటీఓలను సందర్శించిన డీజీపీ

అక్టోపస్‌ పీటీఓలను సందర్శించిన డీజీపీ

- Advertisement -

మరిన్ని సౌకర్యాలకోసం అధికారులకు ఆదేశం
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర డీజీపీబత్తులు బత్తుల శివధర్‌రెడ్డి గురువారం టెర్రరిస్టు నిరోధక విభాగం అక్టోపస్‌, పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ను సందర్శించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్‌ కార్యాలయాన్ని, అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ ఆపరేషన్‌లలో ఉపయోగించే ఆధునిక ఆయుధాలను, బాంబులను ఆయన పరిశీలించారు. అలాగే ఎమర్జిన్సీ సమయంలో అక్టోపస్‌ కమెండోలు ఉపయోగించే విభన్న తరహాలోని సాంకేతిక విజ్ఞానాలను, పరికరాలను కూడా ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి పని విధానాలు, అవసరాల గురించి అక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ అనిల్‌ కుమార్‌ డీజీపి వివరించారు.

అక్టోపస్‌ కమెండోలకు ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రంలో నిరంతరం కొనసాగిస్తున్న ట్రైనింగ్‌ వివరాలను కూడా డీజీపీకి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌ బాబు, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి పలువురు అక్టోపస్‌ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పాత నగరంలోని పేట్లబుర్జులో గల పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ కార్యాలయాన్ని డీజీపీ సందర్శించారు. ఇందులో పోలీసు వాహనాల మరమ్మత్తులతో పాటు వాటి మెయింటెనెన్స్‌ కోసం పీటీఓ ఉపయోగిస్తున్న ఆధునిక పనిముట్లు యంత్రాలను డీజీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయివేటు సంస్థలతో పోటీగా పీటీఓలో నిర్వహిస్తున్న తీరును ఆయన అభినందించారు.

ఆర్టీసీ డ్రైవర్లు,శ్రామిక్‌ పోస్టులకు ఈ నెల 26న సర్టిఫికెట్ల పరిశీలన. : టీజీ పీఆర్‌బీ చైర్మెన్‌ వీవీ శ్రీనివాసరావు
ఆర్టీసీలోని డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల కోసం రిక్రూట్‌ ప్రక్రియను చేపట్టామని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వివి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న మేడ్చెల్‌లోని పీటీసీలో సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు శరీర కొలతలను తీసుకోవాలని ఆయన సూచించారు. డ్రైవర్‌ పోస్టుల కోసం 28వేల మంది, శ్రామిక్‌ పోస్టుల కోసం 25వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని సంబంధిత అడ్మిట్‌ కార్డులను ఈ నెల 13నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌ షష.్‌స్త్రజూతీb.ఱఅ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -