Friday, July 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధర్మారెడ్డిపల్లె కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలి 

ధర్మారెడ్డిపల్లె కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్: మండలంలోని గోకారం చెరువు వద్ద గల ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగు నీరు అందించాలని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం మండలంలోని గోకారం వద్ద నీటిపారుదల శాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమావేశంలో గత ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే నిర్మించారని అన్నారు. చిన్ననీటి కాల్వలను పట్టించుకోలేదని, నామ మాత్రంగా నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప నిధులు విడుదల చేయలేదని అన్నారు. అనంతరం ధర్మారెడ్డిపల్లె కాల్వకు కొనసాగుతున్న  కాలువ పనులను అధికారులతో రైతులతో కలిసి పరిశీలించారు. 


కాలువ నిర్మాణంలో భూసేకరణ పనులు శరవేగంగా చేపట్టాలని, కాలువ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్థి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు మనోహర్, కృష్ణారెడ్డి,  రెవెన్యూ  అధికారులు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, స్థానిక తహశీల్దార్ దశరథ, విద్యుత్ అధికారులు డీఈ మల్లికార్జున్,  నాయకులు భీమా నాయక్, నూతి రమేష్, చిట్టెడి జనార్దన్ రెడ్డి, పాశం సత్తిరెడ్డి, తుమ్మల యూగందర్ రెడ్డి, బాతరాజు బాల్ నర్సింహా, చెరుకు శివయ్య, గూడూరు శ్రీధర్ రెడ్డి, బెలిద నాగేశ్వర్, బోళ్ల శ్రీనివాస్, ఉలిపే మల్లేశం, నోముల మల్లేశం, పలుసం సతీష్, గరిసె రవి, వంగాల అశోక్, ఎస్ కె రసూల్,  బద్దం సంజీవరెడ్డి, కంకల కిష్టయ్య  తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -