నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. దొడ్డు కొమరయ్య నగర్లో గత రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలకు సొంత ఇంటి కల గానే మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు ఓటు హక్కు కార్డు ఆధార కార్డు రేషన్ కార్డు దొడ్డి కొమురయ్య నగర్ కాలనీ పేరు మీద చేసి అట్లాగే కొన్ని మౌలిక సదుపాయాలు, సిసి రోడ్లు మురికి కాలువలు, మంచినీటి కనెక్షన్ మంజూరు చేసి ఇప్పుడు మీరు నివసిస్తున్న ఏరియా ఫారెస్ట్ కి సంబంధించింది కాబట్టి మీకు లోనూ కానీ ఇతర మౌలిక సదుపాయాలు పొందే అర్హత లేదు అంటూ ఉంటే అలాగే ఉండాలి, లేదంటే కాళీ చేయాలి అని ప్రజల్ని భయప్రాంతులకు ప్రభుత్వ అధికారులు గురి చేస్తున్నారు.
కావున దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇంటి టాక్స్ లు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో దొడ్డి కొమరయ్య నగర వాసులకు అన్ని రకాల హక్కులు కల్పించే అంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యవర్గ సభ్యులు కే రాములు, ఎన్ నరసయ్య, నగర కమిటీ సభ్యులు బి.అనసూయ, ఏ అనిత పార్టీ సభ్యులు యశోద లక్ష్మీబాయి, మంగళ్ బాయ్ రమాబాయి సంగీత, పంచ పూల, దీక్షిత బస్తీ వాసులు పాల్గొన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES