నవతెలంగాణ-రెంజల్
రైతులు పండించిన పంటను వారే విక్రయించుకొని ఆర్థికంగా బలోపేతం కావడానికి కేంద్ర ప్రభుత్వం ఫోర్డ్ ఫార్మేషన్ ఆర్గనైజేషన్ కింద రూ.18 లక్షల వరకు నిధులను ఇవ్వనున్నట్లు ధూపలి సొసైటీ చైర్మన్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు 12 సొసైటీలకు నిధులు మంజూరు కాగా, వాటిలో దూపలి సొ దీనిద్సైటీ ఎంపిక అయిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన పదిమందికి ఉపయోగపడే విధంగా వారు వివిధ రకాల పంటలు వేసి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మూడు లక్షల 16 వేల రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం మరో మూడు లక్షల పదహారు వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా రైతులు పండించిన పంటను వారే విక్రయించి వచ్చిన ఆదాయం లో లాభాలను పొందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
ఫుడ్ ఫార్మేషన్ ఆర్గనైజేషన్ కింద ధూపల్లి సొసైటీ ఎంపిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES