Friday, November 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కష్టాలు

అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కష్టాలు

- Advertisement -

కాలిఫోర్నియాలో 17 వేల లైసెన్స్‌లు రద్దు

కాలిఫోర్నియా: విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తోన్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస డ్రైవర్లకు ఇచ్చిన 17వేల లైసెన్స్‌లను రద్దు చేయాలని కాలిఫోర్నియా ప్రభుత్వం యోచిస్తోంది. సెమీ ట్రక్‌, బస్‌ను నడిపేందుకు అక్రమంగా లైసెన్స్‌లు పొందారని, కాలిఫోర్నియా అక్రమ వలసలకు అడ్డాగా మారుతోందని ట్రంప్‌ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. అయితే కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ మాత్రం అది కారణం కాదని చెప్పారు. ఈ లైసెన్స్‌ల కాల వ్యవధి ముగిసిందని అధికారులు గుర్తించారని కాలిఫోర్నియా రాష్ట్ర రవాణా ఏజెన్సీ వెల్లడించింది. దీంతో ఆ ప్రభుత్వం కమర్షియల్‌ లైసెన్స్‌ల సమీక్ష మొదలుపెట్టింది. ఫ్లోరిడాలో ఒక డ్రైవర్‌ నిర్లక్ష్యంగా యూటర్న్‌ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయస్థాయిలో డ్రైవర్ల లైసెన్స్‌లపై ఆడిట్‌ నిర్వహిస్తున్నారు.

టెక్సాస్‌, అలబామాలో కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఇదేతరహా ప్రమా దాలు జరిగాయి. ఇవన్నీ లైసెన్స్‌ల విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ”గత నెల కాలిఫోర్నియాలో ఒక ప్రవాస డ్రైవర్‌ మద్యం మత్తులో ప్రమాదానికి కారమణమయ్యాడు. అదీ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే లైసెన్సుల రద్దుకు గవిన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో తన లైసెన్స్‌ల జారీ విషయంలో తన ప్రమాణాలను సమర్థించుకున్న కాలిఫోర్నియా.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం తమ తప్పులను అంగీకరిం చడమే అవుతుందని అమెరికా రవాణా శాఖ మంత్రి విమర్శించారు. అక్రమ లైసెన్సులే కాదు. అమెరికన్‌ ట్రక్కర్ల జీవనోపాధికి గండి పడుతోంది” అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. డ్రైవర్లకు ఇంగ్లీష్‌ చదవడం, రాయడం వచ్చి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. రోడ్లపై సూచికలు చదవకపోవడం, ఇంగ్లీష్‌లో మాట్లాడక పోవడం వల్లే అనేక ప్రమాదాలకు డ్రైవర్లు కారణమ వుతున్నారని ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -