Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయండిజిటల్‌ అరెస్ట్‌ దేశానికే సవాల్‌

డిజిటల్‌ అరెస్ట్‌ దేశానికే సవాల్‌

- Advertisement -

పౌరులకు అత్యంత భయంకరమైన ముప్పు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ:
డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ..భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుం డడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ అరెస్టును ప్రజలకు ఉన్న అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్‌ నేరాలపై ప్రజలకు పోలీసులు సరైన అవగాహన కల్పించాలన్నారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ వ్యాఖ్యలు చేశారు.

సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్స్‌ చేసి..తాము పోలీసులమని బెదిరిస్తారని.. తాము చెప్పినట్టు చేయకపోతే డిజిటల్‌ అరెస్టు చేస్తామని భయపెడతారని ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ డిజిటల్‌ అరెస్టు ప్రభావం పోలీసు వ్యవస్థపైనా అధికంగా ఉంటుందన్నారు. సైబర్‌ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేయడంతో.. అసలైన పోలీసులు ఎవరనే విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతారన్నారు. దీనిని నివారించాలంటే సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులు నూతన సాంకేతికతపైనా పట్టు సాధించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -