Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిజిటల్ గ్రిల్ ట్రస్ట్ వాల్ మార్ట్ సహకారంతో ఎఫ్బిఓలకు సాంకేతిక శిక్షణ 

డిజిటల్ గ్రిల్ ట్రస్ట్ వాల్ మార్ట్ సహకారంతో ఎఫ్బిఓలకు సాంకేతిక శిక్షణ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
నిజాంబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని పసుపు రైతుల ఉత్పద్దార్ల సంఘంలో నిజాంబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుండి వచ్చిన వివిధ రైతు ఉత్పద్దార్ల సంఘాల చైర్మన్లు, సీఈఓ తోటి డిజిటల్ గ్రీన్ ట్రస్ట్, వాల్మార్ట్  వారి సహకారంతో ఎఫ్సిఓ ల బలోపేతానికి అవసరమైన సాంకేతిక డిజిటలైజేషన్ మీద ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతు పండించే పంటలను మార్కెటింగ్ చేసుకోవడంలో ఎలాంటి మెలకువలు నేర్చుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ప్రోగ్రాం మేనేజర్స్ శ్రీకాంత్, సురేందర్ వారి యొక్క  సందేశాన్ని రైతులకు స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జక్రాన్ పల్లి  మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీమతి దేవిక హాజరై సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఎం కేపీఎం ఎఫ్ఈఓ చైర్మన్ తిరుపతి రెడ్డి , వివిధ రైతు ఉత్పద్దాల సంఘాల చైర్మన్లు, సీఈవోలు పాల్గొనడం జరిగినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -