- Advertisement -
– నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలని వార్డు సభ్యుల మనవి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టెక్రియల్ 13 వ వార్డులో వాటర్ ట్యాంకు శిధిలావస్థంగా చేరింది. చుట్టుపక్కల మొత్తం పాకురు తోటి ఉండడం, అది ఎప్పుడు పడిపోతుందో తెలియకపోవడం తో వార్డు ప్రజలు తాము ఆందోళన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే అది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియడం లేదనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ కింద మొత్తం పిచ్చి మొక్కల తోటి కూడుకొని ఉందన్నారు. దీనిపై మునిసిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని 13వ వార్డు ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -