నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై రూప్ టాప్ సోలార్రైజేషన్ లో భాగంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం పరిశీలన జరుగుతున్నట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంపై రూప్ టాప్ సోలార్రైజేషన్ లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం పంచాయతీరాజ్ ఏఈ రాజన్న ఆధ్వర్యంలో సిబ్బంది రూప్ కొలతలు తీసినట్లు ఆయన తెలిపారు.
పంచాయతీరాజ్ సిబ్బంది రూప్ కొలతలు తీయడాన్ని ఎంపీడీవో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలపై, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలపై సోలార్రైజేషన్ కోసం రూప్ కొలతలు తీసే కార్యక్రమం ట్రాన్స్కో ఏఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. వారు అందించే వివరాల మేరకు ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్రైజేషన్ లో భాగంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన కార్యాలయాల వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
రూప్ టాప్ సోలార్రైజేషన్ కోసం కొలతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES