Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిండి అలుగు బీభత్సం – రాకపోకలు నిలిచిపోయాయి

డిండి అలుగు బీభత్సం – రాకపోకలు నిలిచిపోయాయి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల: రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ పరిధిలోని జాతీయ రహదారి (శ్రీశైలం–హైదరాబాద్ హైవే) పై డిండి అలుగు బీభత్సంగా పారుతోంది. వర్షపు వరద నీటి ఒత్తిడికి వంతెన పొంగిపోవడంతో రహదారిలో రంద్రం ఏర్పడి, హైదరాబాద్–శ్రీశైలం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆటంకం  ఏర్పడిన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి పోలీసులు, రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను అప్రోచ్ రోడ్ వద్దే ఆపివేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వంతెన ప్రాంతానికి ఎవరూ చేరవద్దని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -