నవతెలంగాణ – భువనగిరి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఉత్తీర్ణత అయిన వారికి రాబోయే విద్యా సంవత్సరంలో నేరుగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కల్పిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంఅభినందనీయమని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ, నల్గొండ జిల్లా పరిశీలకులు భీమ్ సింగ్ తెలిపారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం రూ. 56 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత విద్యతో పాటు, ఉచితముగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం భీం సింగ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాపిరెడ్డి తోపాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నేరుగా ఇంజనీరింగ్ సీట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES