Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమట్టిరోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం..

మట్టిరోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ గ్రామం నుంచి అమీర్ నగర్ గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు మరమ్మత్తు పనులను బుధవారం ప్రారంభించారు. గతంలో కురిసిన భారీ వర్షాల మూలంగా రెండు గ్రామాల మధ్య మట్టి రోడ్డు చాలా చోట్ల కోతకు గురై, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు గుండా నిత్యం ప్రజలతోపాటు రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయ పొలాలు, తోటల్లోకి వెళ్లేందుకు రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసేందుకు వాహనదారులు, రైతులు పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

స్పందించిన ఆయన రైతుల సౌకర్యార్థం మట్టి రోడ్డు మరమ్మత్తు పనులకు రూ.2 లక్షల 60వేలు మంజూరు చేయించారు. అట్టి నిధులతో మట్టి రోడు మరమ్మత్తు పనులను కాంగ్రెస్ నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రెండు గ్రామాల రైతుల సౌకర్యార్థం మట్టి రోడ్డు మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కిషన్ కేత్ ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ, గట్టు హనుమాన్లు, భూమారెడ్డి, పేరం సుధాకర్, ప్రతాప్ రెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాస్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad