నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని లింబూరు గ్రామపంచాయతీ పరిధిలో త్రాగునీటి పైప్ లైన్ రంద్రాలు పడి లీకేజ్ అవడంతో పైప్ లైన్ లీకేజ్ రంద్రాలలోకి మురికి నీరు వెళుతున్నా.. పట్టించుకోవడం లేక గ్రామస్తులు ఆ లీకేజీని చూసి భయాందోళనకు గురవుతున్నారు. పైపులైను లీకేజీ లోకి మురికినీరు చేరుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు విధుల్లో వీధిలైట్లు పెట్టడం లేక రాత్రిపూట అంధకారం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవతెలంగాణ లింబూర్ గ్రామాన్ని సోమవారం సందర్శించగా.. ఆ గ్రామస్తులు కొందరు మురికి కాలువలో త్రాగునీటి పైప్లైన్ రంద్రాలు పడి, లీకేజ్ అవుతున్న దృశ్యాన్ని చూపించారు. అదేవిధంగా విధుల్లో వీధిలైట్లు పెట్టడం లేదని ఎన్నిసార్లు గ్రామ కార్యదర్శి కి విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యల గురించి నవతెలంగాణ లింబూర్ గ్రామ కార్యదర్శి శశికాంత్ తో వివరణ కోరగా.. తొందర్లోనే లీకేజీలు పూడుస్తాం, వీధిలైట్లు పెట్టిస్తామంటూ వివరణ ఇచ్చారు.
లింబూర్ లో త్రాగునీటి పైపుల్లోకి మురికి నీరు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES