నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ఎన్.పిఆర్.డి వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మీసాల కురుమయ్య, గౌరవ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వికలాంగుల పెన్షన్ 6 వేల రూపాయలకు పెంచాలని పెండింగ్ పెన్షన్లు మంజూరు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మూసివేసిన టీసీపీసీ సెంటర్లను తిరిగి తెరవాలని కొత్త టీసీపీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పురుష వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని శారీరక వికలాంగుల ఉద్యోగ రోస్టర్ పాయింట్ల పదికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం అధికారి చంద్రశేఖర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గనిమోని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పులిజాల బాలీశ్వర్, మాణిక్యం, ధర్మయ్య, తిరుపతయ్య, వల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES