నవతెలంగాణ – ధర్మసాగర్
విద్యార్థులకు క్రమశిక్షణే జీవితంలో విజయానికి మూలమని మండల విద్యాధికారి రాందాన్ అన్నారు. గురువారం ధర్మసాగర్ మండల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన,క్విజ్ పోటీలనుటి-సాట్ మరియు తెలంగాణ రాష్ట్ర హెడ్మాస్టర్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వ్యాసరచన,ఎలోక్యూషన్,క్విజ్ పోటీలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమాన్ని మండల విద్యాధికారి డా. రామ్ధమ్ ప్రారంభించి, విద్యార్థులకు క్రమశిక్షణే జీవితంలో విజయానికి మూలం అని, ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో వ్యక్తీకరణ నైపుణ్యం, జ్ఞానం,పెంపొందించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించబదుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జెడ్పీహెచ్ఎస్ యూనికిచర్ల ప్రధానోపాధ్యాయులు శ్ శ్రీనివాస్ , మరియు స్కూల్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ ధర్మసాగర్ కె.బి.ధర్మ ప్రసాద్ సమన్వయపరచారు. పోటీలకు అధ్యాపకులు కవితా దేవి, శ్రీ సురేష్, పద్మజ, రాజమ్మ, కిరణ్మయి, శ్రీ రామకృష్ణ జడ్జీలుగా వ్యవహరించి విద్యార్థులను ఉత్తేజపరిచారు.
విద్యార్థులకు క్రమశిక్షణే జీవితంలో విజయానికి మూలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



