- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభం అయింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని మొదలు పెట్టారు. కాళేశ్వరం కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. తీరా చూస్తే ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయి. 20 నెలల నుంచి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం చాలా బాధాకరమైన విషయం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -