- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. దీనిపై సాయంత్రం 4 గంటలకు చర్చ మొదలవుతుందన్నారు. ఫ్లోర్ లీడర్లకు నివేదికకు సంబంధించిన హార్డ్ కాపీలు.. సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు గంటల పాటు విరామం ఇచ్చి ప్రిపేర్ అయ్యాక చర్చిస్తామన్నారు. కేసీఆర్ తరఫున నివేదిక హార్డ్ కాపీని హరీశ్‌రావుకు ఇచ్చినట్లు వివరించారు.
- Advertisement -