- Advertisement -
నవతెలంగాణ న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఆ గేయంపై పార్లమెంట్‌లో నేడు చర్చ జరగనుంది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు.
ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. మోడీ చర్చ ప్రారంభించిన అనంతరం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు దీనిపై ప్రసంగిస్తారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ వాద్రా ఈ చర్చలో పాల్గొననున్నారు.
- Advertisement -


