నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్: గ్రామంలో త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు గ్రామ సమస్యలపై పాలకవర్గంలో చర్చించామని ఉప సర్పంచ్ బండి అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గ్రామపంచాయతీ మొదటి సమావేశాన్ని సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బండి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉందని, సంక్షేమ పథకాలను అందిస్తుందని, పథకాలను గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సమస్యలపై చర్చ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



