Wednesday, November 26, 2025
E-PAPER
Homeబీజినెస్విదేశీ పెట్టుబడిదారుల అనాసక్తి

విదేశీ పెట్టుబడిదారుల అనాసక్తి

- Advertisement -

భారత నికర ఎఫ్‌డీఐల్లో పతనం
న్యూఢిల్లీ :
భారత ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారులు అనాసక్తి చూపుతున్నారు. ఉన్న పెట్టుబడులను తరలించుకుపోతు న్నారు. వరుసగా రెండో మాసంలో నూ నికర ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతికూలంగా నమోద య్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. భారత్‌ నుంచి వెళ్లిన పెట్టుబ డులు వచ్చిన పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నికర ఎఫ్‌డీఐ లు మైనస్‌ 2.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్టుబడుల ప్రవాహం కంటే నిష్క్రమణలే ఎక్కువ భారత కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెరగడం విశేషం.2025 సెప్టెంబర్‌లో మొత్తం గా భారత్‌ నుంచి 9 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలిపోయాయి.
ఇదే సమయంలో 6.6 బిలియన్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. దీంతో ప్రతి కూల వృద్ధితో 2.4 బిలియన్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. ఆగస్టు 2025లో కూడా నికర ఎఫ్‌డీఐ ప్రతి కూలంగానే ఉన్నాయి. ఆ నెలలో మైనస్‌ 0.6 బిలియన్లుగా నమోద య్యాయి. భారతదేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల కంటే.. ఇక్కడ ఉన్న విదేశీ కంపెనీలు తమ లాభాలను వెనక్కి తరలించుకు పోయిన మొత్తం, భారతీయ కంపెనీ లు విదేశాలలో అదనంగా పెట్టుబడి పెట్టిన మొత్తం 2.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని హిందూ ఓ కథనంలో తెలిపింది. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం లోని ఎఫ్‌డీఐలతో పోల్చితే సెప్టెం బర్‌ త్రైమాసికంలో 10.9 శాతం తగ్గుదల చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -