Tuesday, July 22, 2025
E-PAPER
Homeవరంగల్కాటారంలో అస్తవ్యస్తంగా డ్రైయినేజి వ్య‌వ‌స్థ‌

కాటారంలో అస్తవ్యస్తంగా డ్రైయినేజి వ్య‌వ‌స్థ‌

- Advertisement -

దోమల నివారణకు చర్యలు శూన్యం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నిద్రపోతున్నా పారిశుద్ధ్య అధికారులు
పారిశుద్ధ్యం పై పట్టింపు లేదని ప్రజల ఆవేదన
నవతెలంగాణ – కాటారం.
అసలే వర్షాకాలం అందులో కాటారం అంటే నాలుగు మండలాల కూడలి ఎలా ఉండాలి స్వచ్ఛతకు చిరునామాల బహు సుందరంగా ఉండాలి కానీ ఇవి ఏమీ అధికారులకు పట్టవు. అధికారులు వచ్చినమా పోయినమా నెలకు జీతం వచ్చిందా అంతే వాళ్ల పని..ప్రజల ప్రాణాలు గంగా లో కలువని గోదాట్లో మునగని అధికారులకు మాత్రం అనవసరం పారిశుధ్యం అంటే అసలే పట్టింపు లేదు
కాటారం మండల కేంద్రంలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది . ముఖ్యంగా అస్తవ్యస్తంగా డ్రైనేజీల కారణంగా ఇళ్ల మధ్య లో పరిసర ప్రాంతాలలోకి చేరుతున్న మురుగునీరు వల్ల వీధుల్లో నీలుస్తున్న నీటి వల్ల దోమలు, ఈగలు వృద్దిచెందుతున్నాయి దీనికి తోడు రోడ్ల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్లు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని ప్రజలు వాపుతున్నారు రోడ్లపైకి మురుగునీరు ఇష్టానుసారంగా చేరడం డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజలు అనారోగ్యం పాడిన పడుతున్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలకు సోకే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు ఏటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలో మురుగునీరు నిలిచిన చోట్ల బ్లీచింగ్ చల్లకపోవడం కనీసం ఫాగింగ్ కూడా చెయ్యకపోవడంతో ఈగలు విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్నాయి. మండల కేంద్రంలో అసలు ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయా లేదో తెలియని పరిస్థితి ఉంది, వర్షాకాలం ప్రారంభమైన నెల రోజులు దాటిన ఫాగింగ్ ఎందుకు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ సమస్యలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల కేంద్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -