Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారం: ఎస్సై శేఖర్ రెడ్డి

లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారం: ఎస్సై శేఖర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శాంతియుతంగా మరియు చట్టబద్ధంగా వివాదాలను పరిష్కరించుకోవడమే లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ,శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రజలు ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ప్రజలు రాజీపడదగిన కేసులను రాజీ చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.లోక్ అదాలత్ అనేది న్యాయపరమైన వివాదాలను వేగంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించే ఒక వేదిక. ఇది ఫిర్యాది, ముద్దాయి ఇద్దరికీ ఒక సువర్ణావకాశం. ముఖ్యంగా కుటుంబ కలహాలు, చిన్న చిన్న గొడవలు వంటి వాటిని కోర్టుల చుట్టూ తిరగకుండా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.చిన్న కేసుల కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకే గ్రామంలో లేదా పట్టణంలో నివసించేవారు ఎప్పుడూ కలిసి ఉండాలి. రాజీ మార్గం రాజ మార్గం” అని ఆయన నొక్కి చెప్పారు.ఈ జాతీయ లోక్ అదాలత్‌లో, ఇరు పక్షాలు వారి ఇష్టపూర్వకంగా కేసులు రాజీ చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad