నవతెలంగాణ – వనపర్తి/పానగల్
బాలల దినోత్సవం సందర్భంగా పానగల్ మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి మహాత్ముల సంబంధించిన పుస్తకాలను శుక్రవారం విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా పూరి సురేష్ శెట్టి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పలు పాఠశాలలకు పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది పానగల్ బాలికల పాఠశాలకు పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ కూడా త్వరలోనే అందజేస్తామని వారు తెలియజేశారు. వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



