కుటుంబాలను ఆదుకుంటాం..
ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గం లోని జాక్రన్ పల్లి మండలం లోని అర్గుల్ లో పి వి అర్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గల్ఫ్ పాలసీ ద్వారా దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ను ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దురదృష్టవశాత్తూ మరణించిన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా నిజామాబాద్ రూరల్ కు సంబంధించి 55 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు మంజురైనట్లు వివరించారు.
అందులో ఇందల్ వాయి మండలానికి సంబంధించి నలుగురు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియాను ఎమ్మెల్యే అందజేశారు.మండలంలోని అన్సన్ పల్లి గ్రామ నివాసి షేక్ హసీనా, చంద్రయన్ పల్లి గ్రామ నివాసి బాండ్ల సుజాత, గన్నారం గ్రామ నివాసి కషెట్టు లక్ష్మి, కేకే తండా గ్రామ నివాసి జానకి వీరికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించారు. తలుపుల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని బాధిత కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండేందుకే ఈ స్కీంను ప్రవేశపెట్టినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES