- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను మంగళవారం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాసానిపల్లి పెరమాండ్లు సహకారంతో మండలంలోని ప్రతి గ్రామంలో టోకెన్లు తీసుకున్న వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తిరుపతి గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.పట్టణ కేంద్రంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో విధులు నిర్వహించి స్కూల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగం పొందిన రామాంజనేయులు మట్టి వినాయకుడిని తయారు చేశారు. గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయకుడి తయారు చేస్తూ పాఠశాలలో ప్రతిష్టిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, అశోక్ యాదవ్ తెలిపారు.
- Advertisement -