Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగుల పంచమి సందర్బంగా విద్యార్థినిలకు దుస్తుల పంపిణీ

నాగుల పంచమి సందర్బంగా విద్యార్థినిలకు దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 35 మంది విద్యార్థినిలకు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో నాగుల పంచమి సందర్భంగా మంగళవారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థుల కొరకు నెలకొల్పడం జరిగింది. అత్యధికంగా పేదరికం వారి ఇటువంటి గురుకులం పాఠశాలలో జిల్లాలోని పలు మండలాల వారు విద్యనభ్యసిస్తుంటారు. మంగళవారం నాగుల పంచమి పండుగ సందర్భంగా వారి సొంత ఇండ్లకు వెళ్లలేక పండుగను కేజీబీవీ గురుకుల పాఠశాలనే ఉండడం గమనించిన జుక్కల్ ఎంపీడీవో తన సహచర సిబ్బందితో కలిసి తమ సొంత ఖర్చులతో దుష్టులను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్న వెంటనే షాపింగ్ కి వెళ్లి సొంత ఖర్చులతో 35 మంది పేద విద్యార్థులకు బట్టలను కొనుగోలు చేసి వారి పాఠశాలకు వెళ్లి అక్కడే కార్యక్రమం నిర్వహించి దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం కళాశాల ఉపాధ్యాయినీల బృందం కలిసి ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము,   రికార్డు అసిస్టెంట్ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ అనిల్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది శ్రావణ్, లను శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయునిల బృందం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -