– ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
నవతెలంగాణ -ముధోల్ : రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు .సోమవారం భైంసా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముధోల్ మండలానికి చెందిన19మంది లబ్ధిదారులకు 4లక్షల 23వేయిల 500 వేల రూపాయల చెక్కులను అందించారం.ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వం తరఫున సహాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి ధ్యేయమన్నారు. ఇందులో ఎ లాంటి రాజకీయాలకు తావు లేదని ప్రజలు నేరుగా వచ్చి తమ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా వేలాది చెక్కులను 20 నెలల కాలంలో అందించడం జరిగిందన్నారు. సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జిమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని విద్య, వైద్యం, సాగు నీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలని సంక్షేమ ఫలాలు అర్హులైన పేదవారికి అందించడమే తన ధ్యేయమన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి ముధోల్ మండల అధ్యక్షులు కోరి పోతన్న, నాయకులు తాటివార్ రమెష్, ప్రవీణ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES