Sunday, January 11, 2026
E-PAPER
Homeకరీంనగర్భూ నిర్వాసితులకు నష్ట పరిహార చెక్కుల పంపిణీ

భూ నిర్వాసితులకు నష్ట పరిహార చెక్కుల పంపిణీ

- Advertisement -

ఇప్పటి వరకు 70 మందికి నష్టపరిహారం చెక్కులు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నవతెలంగాణ – సిరిసిల్ల

వేములవాడ పట్టణంలో ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి చెక్కులు పంపిణీ చేశారు వేములవాడలోని 20 మందికి చెక్కులు అందజేశారు. ఇప్పటిదాకా మొత్తం 70 మందికి చెక్కులు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -