నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బాల్కొండ మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద రెడ్డి డెస్క్ బెంచ్ లను అందజేశారు. పాఠశాలల సమగ్ర అభివృద్ధికి మొదటి నుండి పూర్తిస్థాయిలో చేయూతనందిస్తున్న ఏనుగు దయానంద రెడ్డి మరోమారు తన దయార్ధ హృదయాన్ని చాటుకున్నారు.హాస కొత్తూర్ ఉన్నత పాఠశాలకు నాణ్యవంతమైన 20 డెస్క్ బెంచ్ లను అందజేయడంతో సోమవారం వాటిని అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమార్ తెలిపారు.
గతంలోనూ పాఠశాలకు సంబంధించి క్రీడాకారులకు యూనిఫామ్స్, క్రీడా సామాగ్రిని అందజేశారని, తాజాగా డెస్క్ బెంచ్ లతోపాటు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ కూడా అందజేస్తున్నారని ఆయన తెలిపారు. పాఠశాల అవసరాలను తెలిపిన వెంటనే వాటిని పరిష్కరిస్తున్న దయానంద రెడ్డికి పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. దయానంద రెడ్డికి సమస్యలు తెలిపి డెస్క్ బెంచ్ ల వితరణకు కృషి చేసిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మాధురిని పాఠశాల సిబ్బంది, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ధర్పల్లి సతీష్ కుమార్, సభ్యులు కిషన్ గౌడ్, గడ్డం వినోద్, డిష్ రాజు, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
హాస కొత్తూర్ పాఠశాలకు డెస్క్ బెంచ్ ల వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES