- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నూలి పురుగు నివారణ మాత్రలను మంగళవారం పీహెచ్సీ వైద్యులు సురేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 5562 మంది విద్యార్థులకు గాను 49 96 మంది విద్యార్థులకు మాత్రలు అందజేసి 90% విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయులు రాజు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -