నవతెలంగాణ – కాటారం: కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో ముస్లిం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈద్ కా తోఫా పండగ కానుకలను శనివారం మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కోట్లాది నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటున్నారని అన్నారు. మన ప్రాంతంలో నిరుపేద మైనార్టీల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ డబ్బేట సరోజన రాజేష్, గ్రామ పాలకవర్గం సభ్యులు, మైనార్టీ నాయకులు, దొబ్బెట రాజేష్, చాంద్ పాషా, నిజాం, నయీం, వరుణ్ ఖాన్, ఖాన్డిసిసి జనరల్ సెక్రటరీ కుంభం స్వప్నరెడ్డి, మహదేవపూర్ మహిళా అధ్యక్షురాలు బందెల సత్తెమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
ముస్లిం కుటుంబాలకు ఈద్ కా తోఫా కానుకల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



