- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫైనల్ పరీక్షల కోసం అవసరమైన మెటీరియల్‌ను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గ్రామంలోని పి ఎం సి జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న టెన్త్ తరగతి విద్యార్థులకు ఈ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, చదువుపై మరింత దృష్టి పెట్టాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రవీణ్ , ప్రవీణ్ కుమార్, రాకేష్, శేఖర్, పిప్పిరిశీటీ రాజు, మహేష్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



