నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాసకోతుర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి పలువురు లబ్ధిదారులకు మంజూర ఆర్థిక సహాయం చెక్కులను మంగళవారం టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సాయన్నకు రూ.44వేలు, కేలవత్ జ్యోతికి రూ.27వేలు, వేముల లతకు రూ.16వేలు, నలిమెల పద్మకి రూ.60వేలు, నాయిని పూర్ణిమకు రూ.8వేలు, రేగురి లక్ష్మీ రాజంకు రూ.15వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేసింది.
అట్టి చెక్కులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషి చేసిన సునీల్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఏనుగు మనోహర్, ఎడ్ల శ్రీకాంత్, మోహన్ నాయక్, మోదీని శ్రీధర్, దశ రాజేశ్వర్, డీసీఎం గంగాధర్, పురుషోత్తం, ధర్మయ్య, రాజారాం, గోపిడి రాజేశ్వర్, వేముల రవి, కార్యకర్తలు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES